అమ్మ మాటలు గుర్తు చేసుకుంటూ... భావోద్వేగానికి గురైన మోడీ

అమ్మ మాటలు గుర్తు చేసుకుంటూ... భావోద్వేగానికి గురైన మోడీ

విశ్వంభర, వెబ్ డెస్క్ : లోక్​ సభ ఐదో దశ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు ఉత్తర ప్రదేశ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్​ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే జాతీయ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ...కాశీతో తనకున్న 10 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

గంగా మాత తనను దత్తత తీసుకుందని, కాశీ ప్రజల ప్రేమ, ఆప్యాయత తనను బనారస్ గా మార్చిందని మోడీ అన్నారు. తన తల్లికి వందేళ్లు నిండిన సందర్భంగా ఆమె పెట్టిన రోజుకు వెళ్లినప్పుడు ఆమె చెప్పిన మాటలను గుర్తు చేసుకుని ప్రధాని ఉద్వేగానికి లోనయ్యారు. ఎవరి వద్ద లంచం తీసుకోవద్దని, పేదలను మరిచిపోవద్దని అమ్మ చెప్పిందన్నారు. తెలివిగా పనులు చేసి, స్వచ్ఛమైన జీవితాన్ని గడపాలని తన తల్లి చెప్పిందని మోడీ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Read More తిరిగి మన మూలాల్లోకి వెళ్దాం:వెంకయ్య నాయుడు

 

Related Posts