అక్షయ్ కుమార్‌కు తప్పిన పెను ప్రమాదం

జుహు వద్ద అదుపుతప్పిన ఆటో.. హీరో కాన్వాయ్‌పైకి దూసుకెళ్తూ బోల్తా

అక్షయ్ కుమార్‌కు తప్పిన పెను ప్రమాదం

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ దంపతులకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ముంబయిలోని జుహు ప్రాంతంలో సోమవారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదం నుంచి అక్షయ్ కుమార్, ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా క్షేమంగా బయటపడ్డారు.

విశ్వంభర, సినిమా బ్యూరో: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ దంపతులకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ముంబయిలోని జుహు ప్రాంతంలో సోమవారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదం నుంచి అక్షయ్ కుమార్, ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా క్షేమంగా బయటపడ్డారు. ప్రమాద తీవ్రతకు అక్షయ్ సెక్యూరిటీ ఎస్కార్ట్ వాహనం రోడ్డుపై బోల్తా పడటంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.

అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా దంపతులు తమ 25వ వివాహ వార్షికోత్సవ వేడుకలను విదేశాల్లో జరుపుకుని, తిరిగి ఇంటికి వస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టు నుంచి తమ నివాసానికి వెళ్తుండగా జుహు సమీపంలో ఒక కారు అత్యంత వేగంగా వచ్చి ఎదురుగా ఉన్న ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటో నియంత్రణ కోల్పోయి నేరుగా అక్షయ్ కుమార్ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పైకి దూసుకొచ్చింది. ఆటోను తప్పించే క్రమంలో అక్షయ్ వాహనం, ఆయన సెక్యూరిటీ కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో సెక్యూరిటీ సిబ్బంది ఉన్న ఎస్కార్ట్ కారు పల్టీ కొట్టి బోల్తా పడింది.

Read More అసలు యుద్ధం ఇప్పుడే ప్రారంభమైంది: ఉద్ధవ్ థాకరే

ఈ ప్రమాదంలో అక్షయ్ కుమార్, ట్వింకిల్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. అదృష్టవశాత్తు వారి వాహనంలోని సేఫ్టీ ఫీచర్లు పని చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడటంతో అతడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆటో పూర్తిగా ధ్వంసమైంది. 

అక్షయ్ కుమార్ దంపతులు జనవరి 18నే తమ 25వ పెళ్లి రోజును ఘనంగా జరుపుకున్నారు. "ఒకరి కలలకు ఒకరం తోడుగా ఉంటూ.. ఈ 25 ఏళ్ల ప్రయాణం ఎంతో మధురంగా సాగింది" అంటూ అక్షయ్ పోస్ట్ చేసిన వీడియో అభిమానులను ఆకట్టుకుంది. ఇంతలోనే ఈ ప్రమాదం జరగడం కలకలం రేపినప్పటికీ, తమ అభిమాన నటుడు క్షేమంగా ఉన్నారని తెలిసి ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.