పవన్ కల్యాణ్‌ ను బాబాయ్ అంటూ ట్వీట్ చేసిన ఉపాసన.. రచ్చ రచ్చ..!

పవన్ కల్యాణ్‌ ను బాబాయ్ అంటూ ట్వీట్ చేసిన ఉపాసన.. రచ్చ రచ్చ..!

 

మొన్నటి ఏపీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ప్రధానంగా పవన్ కల్యాణ్‌ పేరు హైలెట్ అవుతోంది.ఆయన వల్లే విజయం సాధించారని.. ఇంకా చెప్పాలంటే ఇది పవన్ కల్యాణ్‌ విజయం అన్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటు మెగా ఫ్యామిలీ కూడా పెద్ద ఎత్తున సంబురాలు చేసుకుంటోంది.

Read More సినిమా నడుస్తుండగానే వర్షం.. తడిసి ముద్దయిన ప్రేక్షకులు.. వీడియో ఇదిగో!

ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ చిరంజీవి, పవన్ కల్యాణ్‌ చేతులను పట్టుకుని అభివాదం చేసిన ఫొటో అయితే సోషల్ మీడియాను షేక్ చేసి పడేసింది. ఇదే ఫొటోను రామ్ చరణ్‌ భార్య ఉపాసన పోస్టు చేస్తూ... ‘కంగ్రాచులేషన్స్ పవన్ కళ్యాణ్ బాబాయ్. జనాలు చాలా బాగా ఆలోచించి జనసేన పార్టీని ఎన్నుకున్నారు. జై హింద్’ అంటూ ట్వీట్ చేసింది.

ఇంకేముంది దానిపై పెద్ద చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆమె ట్వీట్ లో చిరంజీవిని మామయ్య అని పవన్ కల్యాణ్‌ ను బాబాయ్ అనడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అదేంటి చిరు మామయ్య అయినప్పుడు పవన్ బాబాయ్ ఎలా అవుతాడని అంటున్నారు. ఇంకొందరేమో ఆమె గతంలో కూడా పవన్ ను బాబాయ్ అంటూ సంబోధించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక మీదట అయినా పవన్ ను బాబాయ్ అని పిలవమ్మా అంటూ సలహాలు ఇస్తున్నారు.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా