ఫ్యాన్స్‌కి తారక్ బర్త్ డే ట్రీట్.. గూస్ బమ్స్ తెప్పిస్తున్న ఫియర్ సాంగ్!
ట్రిపులార్ సినిమా విడుదలై రెండేళ్లు దాటుతున్నా.. తారక్ కాంపౌండ్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఎన్టీఆర్ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే, తారక్ మాత్రం లేట్ అయినా లేటెస్టుగా రావాలని ఫిక్స్ అయ్యారు. అందుకే ట్రిపులార్‌కు మించి ఉండేలా దేవర సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ లోపు ఫ్యాన్స్ డిజాప్పాయింట్ అవ్వకుండా సినిమాకు సంబంధించిన ఒక్కో అంశాన్ని రివీల్ చేస్తున్నారు.
ఫస్ట్ సినిమా పోస్టర్ రిలీజ్ చేసి.. ఫ్యాన్స్‌లోనే కాకుండా కామన్ ఆడియన్స్‌లో కూడా దేవర టీం ఇంట్రస్ట్ క్రియేట్ చేసింది. తర్వాత జూనియర్ శ్రీదేవీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో నటిస్తుందని చెప్పడంతో దేవరపై క్రేజీ బజ్ క్రియేట్ అయింది. సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రావడంతో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా అనౌన్స్ చేశారు. దీంతో.. టాలీవుడ్ సత్తా ఏంటో దేవర చూపిస్తోందని ఇండస్ట్రీ వర్గాలు డంకా మోగించాయి. ఇప్పుడు దేవర యూనిట్ నుంచి మరో బిగ్ అప్టేడ్ వచ్చేసింది. రేపు తారక్ బర్త్ డే కావడంతో ఓ రోజు ముందుగానే ఫ్యాన్స్ మంచి ట్రీట్ ఇచ్చారు కొరటాల శివ.
ఈ సినిమా నుంచి ఫియర్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. అనిరుద్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు.
లిరిక్స్ వింటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ పాటను తెలుగులో రామజోగయ్య శాస్త్రి, హిందీలో మనోజ్ ముంతాషిర్, తమిళంలో విష్ణు ఏడవన్, కన్నడలో ఆజాద్ వరదరాజ్, మలయాళంలో గోపాలకృష్ణన్ రాశారు. ఈ పాట కోసం రైటర్స్ బ్లడ్ పెట్టి పని చేశారని
ఇప్పటికే మేకర్స్ చెప్పారు. మేకర్స్ చెప్పిన మాటలను ఏమాత్రం తగ్గించకుండా సాంగ్ ఉంది. ఎన్టీఆర్, కొరటాల కాంబో అంటే సహజంగానే భారీ అంచనాలు ఉంటాయి. ఈ సాంగ్‌తో ఫ్యాన్స్‌లో స్కై లెవెల్ ఎక్స్‌పెక్‌టేషన్స్ పెరిగిపోయాయి.