తండ్రి, బాబాయ్ లను ప్రధానితో చూసి రామ్ చరణ్ ఎమోషనల్..!
బుధవారం నాడు జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎన్నో అపురూప ఘట్టాలు చోటుచేసుకున్నాయి. ఇక ఈ వేడుకకే హైలెట్ గా నిలిచింది. మెగా బ్రదర్స్ తో మోడీ చేసిన అభివాదం. పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం పూర్తి అయిన వెంటనే ప్రధాని నరేంద్రమోడీని వెళ్లి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. దాంతో మోడీ చిరంజీవి ఎక్కడ అని అడిగారు.
దాంతో పవన్ తన అన్న దగ్గరకు ప్రధాని మోడీని తీసుకెళ్లారు. చిరంజీవిని ఆప్యాయంగా పలకరించిన ప్రధాని నరేంద్ర మోడీ.. పవన్ కల్యాణ్ చేయిని ఓ చేతిలో పట్టుకుని.. చిరంజీవి చేయిని మరో చేతిలో పట్టుకుని ప్రజలకు అభివాదం చేశారు. దాంతో సభా ప్రాంగణం మొత్తం అరుపులతో హడలెత్తిపోయింది.
ఇదంతా వీవీఐపీ గ్యాలెరీలో చూస్తున్న రామ్ చరణ్.. ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. తండ్రి, బాబాయ్ లను ప్రధాని మోడీతో చూడగారు చరణ్ కండ్లలో నీల్లు తిరిగాయి. ఆయన కంటతడి పెడుతున్న దృశ్యం వీడియోలో స్పష్టంగా కనిపించింది. దీంతో ఈ వీడియోపై రకరకాలుగా మెగా అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.