పుష్ప-2 వాయిదా.. కొత్త తేదీ ప్రకటించిన మూవీ టీమ్

పుష్ప-2 వాయిదా.. కొత్త తేదీ ప్రకటించిన మూవీ టీమ్




అందరూ అనుకున్నదే జరిగింది. సుకుమార్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప-2ను వాయిదా వేస్తున్నట్టు మూవీ టీమ్ అఫిషియల్ గా ప్రకటించింది. ఇంతకు ముందు ఆగస్టు 15న మూవీని విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే మూవీ షూటింగ్ ఆలస్యంతో పాటు పోస్టు ప్రొడక్షన్ వర్క్ పై సుకుమార్ అంత సంతృప్తిగా లేరని వార్తలు వైరల్ అయ్యాయి.

Read More సినీ పరిశ్రమలో విషాదం – ప్రముఖ నటుడు విజయ్‌ రంగరాజు మృతి

దాంతో పుష్ప మూవీ వాయిదా పడుతుంది అంటూ వార్తలు వచ్చాయి. ఇందుకు తగ్గట్టుగానే తాజాగా మూవీ టీమ్ అఫిషియల్ గా ప్రకటించింది. మూవీని డిసెంబర్ 6న విడుదల చేస్తామని ప్రకటించింది. షూటింగ్ ఆలస్యంతో పాటు పోస్టు ప్రొడక్షన్ వర్క్ వల్లనే ఆలస్యం అవుతున్నట్టు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ తేదీనే విడుదల చేస్తున్నట్టు వారు తెలిపారు. 

దాంతో బన్నీ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఇక ఆగస్టు 15న పుష్ప వాయిదా పడటంతో ఆ ప్లేస్ లోకి డబుల్ ఇస్మార్ట్ మూవీ వచ్చి చేరిన సంగతి తెలిసిందే. 


Related Posts