రీరిలీజ్‌కు సిద్ధమైన ప్రభాస్ ‘చక్రం’ సినిమా
ప్రభాస్ నటించిన క్లాసికల్ మూవీ ‘చక్రం’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. జూన్ 8వ తేదీన గ్రాండ్‌గా రీరిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. హీరోల జన్మదిన వేడుకలు లేదా సినిమా వార్షికోత్సవాల సందర్భంగా ఇదివరకు సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాలను విడుదల చేస్తున్నారు. దీంతో థియేటర్లలో అభిమానుల సందడి అంతాఇంతా కాదు. ఇదిలా ఉంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన వర్షం, మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమాలు ఇప్పటికే రీరిలీజ్ అయిన విషయం తెలిసిందే.
తాజాగా ప్రభాస్ నటించిన క్లాసికల్ మూవీ ‘చక్రం’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. జూన్ 8వ తేదీన గ్రాండ్‌గా రీరిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో 2005లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో మిశ్రమ ఫలితాలను అందుకుంది. అయినప్పటికీ చాలా మంది గుండెల్లో ఈ సినిమా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
టీవీల్లో ఈ సినిమా ప్రసారమయ్యాక ప్రేక్షకాదరణ పెరిగింది. అయితే ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ చక్రి అందించిన పాటలు హైలెట్ అని చెప్పాలి. ఇప్పటికీ చాలా మంది తమ ప్లేలిస్ట్‌లో ఈ సినిమా పాటలు వింటుంటారంటే అతిశయోక్తికాదు. ఈ క్లాసికల్ సినిమాలో ఛార్మి, ఆసిన్‌లు హీరోయిన్లుగా నటించారు. అదేవిధంగా ప్రకాష్‌రాజ్ హీరో తండ్రి పాత్రలో నటించి మెప్పించారు.