మాస్ కాంబో.. బోయపాటితో బాలయ్య నాలుగో సినిమా
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ ఇప్పటికే మూడు సినిమాలు చేశారు. ఈ కాంబోలో ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించాయి.
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ ఇప్పటికే మూడు సినిమాలు చేశారు. ఈ కాంబోలో ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించాయి. ఇవాళ(సోమవారం) బాలకృష్ణ జన్మదిన సందర్భంగా బాలయ్య అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు బోయపాటి.
బాలయ్యతో తాను చేసే నాలుగో సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే సినిమాకు సంబంధించిన టైటిల్‌ను రివీల్ చేయలేదు. #BB4 అనే వర్కింగ్ టైటిల్‌ను ప్రకటించారు.14 రీల్స్ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలయ్య కూతురు తేజస్విని కూడా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహిస్తుండటం విశేషం.
ఇదిలా ఉండగా 2021లో వచ్చిన అఖండ సినిమా భారీ విజయాన్ని కైవసం చేసుకోగా ఆ సినిమాకు సీక్వెల్‌గా అఖండ-2 ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే బోయపాటి సినిమాకు సంబంధించి టైటిల్‌ను రివీల్ చేయకపోవడంతో #BB4 టైటిల్ వేరే సినిమా అయి ఉండొచ్చని పలువురు అంటున్నారు. ఏది ఏమైనా బోయపాటి, బాలయ్య కాంబినేషన్‌లో సినిమా అంటే మాస్ ప్లేక్షకులకు జాతరనే చెప్పాలి.