టెన్త్ క్లాస్ లోనే లవ్ లో పడ్డా.. అందుకే బ్రేకప్ అయింది.. ఈషారెబ్బా
తెలంగాణ పిల్ల ఈషారెబ్బా ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. హీరోయిన్ అవుదామని వచ్చిన ఆమె.. మొదట్లో కొన్ని చిన్న సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఆమె సెకండ్ హీరోయిన్ గా.. ఇప్పుడు థర్డ్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం నటిగా రాణిస్తోంది. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో ఆమె తన లవ్ స్టోరీ గురించి ఆసక్తికర కామెంట్లు చేసింది.
నేను టెన్త్ లో ఉండగానే ఓ అబ్బాయితో లవ్ లో పడ్డాను. వాడంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు ఎక్కడ ఉంటాడో నా దగ్గర ఫుల్ డీటేయిల్స్ ఉండేవి. అయితే అప్పట్లో రూపాయి కాన్ బాక్స్ నుంచి వాడికి ఫోన్లు చేసేదాన్ని. అప్పుడప్పుడు కలిసి బయట తిరిగాం. చాలా ఎంజాయ్ చేశాం. కానీ ఎందుకో వాడిమీద ఇంట్రెస్ట్ పోయింది.
నేను ఇంటర్ కాలేజీకి వచ్చిన తర్వాత వాడు నాకు రూల్స్ పెట్టాడు. దాంతో వాడి మీద ఇంట్రెస్ట్ పోయింది. హై హీల్స్ వేసుకోమని కండీషన్ పెట్టాడు. దాంతో ఇక వాడు నాకు సెట్ కాడని అర్థం అయింది. అందుకే బ్రేకప్ చెప్పేశా. కానీ ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడో కూడా నాకు తెలియదు. నేను కట్ అంటే కట్ అంతే అంటూ చెప్పుకొచ్చింది ఈషారెబ్బా.