తెలంగాణలో రెండు వారాలపాటు థియేటర్స్ బంద్.. నష్టాలే కారణమా? 

తెలంగాణలో రెండు వారాలపాటు థియేటర్స్ బంద్.. నష్టాలే కారణమా? 

ఒకప్పుడు సినిమా అంటే పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లేవారు కానీ ఇప్పుడు మాత్రం సినిమాలను చూడటానికి పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో థియేటర్ యాజమాన్యం భారీ స్థాయిలో నష్టాలను చవి చూస్తుందని తెలుస్తోంది. అయితే తాజాగా తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యం ఊహించని నిర్ణయం తీసుకుంది. 

 

Read More ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి:మాజీ సర్పంచ్ ఉజ్జిని నరేందర్ రావు 

నేటి నుంచి తెలంగాణలో రెండు వారాలపాటు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. థియేటర్ ఆక్యుపెన్సీ పూర్తిగా పడిపోయిందని తద్వారా నష్టాలు అధికంగా వస్తున్నటువంటి తరుణంలో రెండు వారాలపాటు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్నింటినీ క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విధంగా ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడంతో తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఆర్థిక ఇబ్బందుల కారణంగానే థియేటర్లను మూసి వేస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించారు. 

 

Read More ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి:మాజీ సర్పంచ్ ఉజ్జిని నరేందర్ రావు 

ఇక ఈ విషయంపై నిర్మాతలు స్పందించి థియేటర్ అద్దెలను పెంచి యాజమాన్యులను ఆదుకోవాలని కోరారు. అయితే థియేటర్ ఆక్యుఫెన్సీ విషయంలో మార్పులు కనుక చోటుచేసుకుని పరిస్థితిలో అనుకూలిస్తే తప్పకుండా థియేటర్లను తిరిగి ప్రారంభిస్తామని థియేటర్ యాజమాన్యం వెల్లడించింది. అయితే సినిమాలు విడుదలైన కొద్ది రోజులకే ఓటీటీలలోకి అందుబాటులోకి రావటం కూడా అందుకు ఒక కారణం కావచ్చు అని తెలుస్తుంది.