ఆసక్తికరంగా శర్వానంద్ ‘మనమే’ ట్రైలర్
టాలీవుడ్ యువ కథానాయకుల్లో ఒకరైన శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.
టాలీవుడ్ యువ కథానాయకుల్లో ఒకరైన శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. జూన్ 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఇప్పటి నుంచే చిత్రయూనిట్ టైటిల్ గ్లింప్స్‌తో పాటు టీజర్‌ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. కథను ఏమాత్రం రివీల్ చేయకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ ట్రైలర్‌లో శర్వానంద్, కృతి శెట్టి కలిసి ఒక బాబుని పెంచుతున్నట్లు కనిపించారు. అయితే ఆ బాబు ఎవరనేది క్లారిటీ ఇవ్వలేదు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా ట్రైలర్‌ను యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
పాపులర్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. విజయ్ దేవరకొండ ‘ఖుషి’, న్యాచురల్ స్టార్ నాని ‘హాయ్ నాన్న’ సినిమాలతో అబ్దుల్ వహాబ్ టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు.