పెళ్లికి సిద్ధమైన హీరో ప్రభాస్.. ఆ పోస్టుకు అర్థం అదేనా? 

పెళ్లికి సిద్ధమైన హీరో ప్రభాస్.. ఆ పోస్టుకు అర్థం అదేనా? 

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో ఎవరు అంటే అందరికీ టక్కున ప్రభాస్ పేరు గుర్తుకు వస్తుంది. ఈయన కన్నా ఇండస్ట్రీలో చాలా చిన్నవారు ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అయ్యారు. ఇప్పటివరకు ప్రభాస్ మాత్రం పెళ్లి గురించి ఎక్కడ స్పష్టంగా వివరించిన దాఖలాలు లేవు అయితే తాజాగా ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. 

 

ప్రభాస్ సోషల్ మీడియాలో చాలా అరుదుగా పోస్టులు చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఈయన చేసిన ఈ పోస్ట్ చూస్తే మాత్రం తప్పకుండా ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ప్రభాస్ ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా పోస్ట్ షేర్ చేస్తూ.. డార్లింగ్స్.. మొత్తానికి మా జీవితంలోకి ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు వెయిట్ చేయండి అంటూ ఈయన చేసినటువంటి ఈ పోస్ట్ ఆసక్తి రేపుతుంది.

 

ఇలా స్పెషల్ వ్యక్తి రాబోతున్నారు అంటూ ప్రభాస్ పోస్ట్ చేయడంతో తప్పకుండా ఈయన పెళ్లి చేసుకుంటున్నారని,ఆయన జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారా అనే ఉద్దేశంతోనే ఈ పోస్ట్ చేశారని తెలుస్తోంది. మరి ప్రభాస్ చేసిన ఈ పోస్ట్ తన పెళ్లిని ఉద్దేశించే చేశారా లేకపోతే మరేదైనా ఉద్ధేశంతో చేశారా అనేది తెలియాల్సి ఉంది.

Related Posts