ఆ నమ్మకంతోనే బ్రతుకుతున్నా.. అలా రావాలని నేను కోరుకోను: కోవై సరళ 

ఆ నమ్మకంతోనే బ్రతుకుతున్నా.. అలా రావాలని నేను కోరుకోను: కోవై సరళ 

కోవై సరళ పరిచయం అవసరం లేని పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా సుమారు 900 కు పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించినటువంటి లేడీ కమెడియన్ ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి. అయితే చాలా రోజుల తర్వాత ఈమె మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యారు.

 

Read More మా నాన్నకు నేను సినిమాల్లో ఉండటం ఇష్టం లేదుః మంచులక్ష్మీ

ఈ కార్యక్రమాలలో భాగంగా ఈమె ఎన్నో విషయాలను వెల్లడించారు. ప్రతి ఒక్కరు సినిమాలలో నా బాడీ లాంగ్వేజ్ అలాగే వాయిస్ ఇష్టపడతారు అయితే నేను అవి సినిమా కోసం తెచ్చి పెట్టుకున్నవి కాదని నిజజీవితంలో కూడా నా బాడీ లాంగ్వేజ్, నా వాయిస్ ఇలాగే ఉంటుందని తెలిపారు. నాకు తెలుగులో అలీ గారు అలాగే బ్రహ్మానందం గారు అంటే చాలా ఇష్టమని తెలిపారు. బ్రహ్మానందంతో కలిసి తాను సుమారు 100 సినిమాలలో నటించాలని వెల్లడించారు. 

 

Read More మా నాన్నకు నేను సినిమాల్లో ఉండటం ఇష్టం లేదుః మంచులక్ష్మీ

ఇలా ఎన్నో సినిమాలలో నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. దీంతో పెళ్లి లేకుండా ఎలా బతుకుతున్నారు..రేపొద్దున మిమ్మల్ని ఎవరు చూస్తారు అనే ప్రశ్న ఆలీ వేశారు. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ.. పెళ్లి చేసుకొని పిల్లలు ఉన్న తర్వాత కూడా పిల్లలు చూస్తారన్న గ్యారెంటీ లేదు పిల్లలు ఎక్కడో విదేశాలలో ఉంటున్నారు భర్త చనిపోయిన ఒంటరి మహిళలు ఇక్కడ ఏం చేస్తున్నారు. ఎవరిపై నమ్మకంతో నేను బ్రతకలేదని నా నమ్మకమే నన్ను బ్రతికిస్తుంది. నన్ను చూడటానికి ఎవరో రావాలని నేను కోరుకోను రేపటి గురించి రేపే ఆలోచిస్తాను అంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా