విజయ్ సేతుపతి కాళ్లు మొక్కిన స్టార్ డైరెక్టర్

విజయ్ సేతుపతి కాళ్లు మొక్కిన స్టార్ డైరెక్టర్



స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తీసింది ఒక్క సినిమానే అయినా.. ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేశారు. ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్ కూడా అంత బాగా తీయలేడేమో అన్నంతగా ఉప్పెన సినిమాను తీసి బాక్సాఫీస్ ను బద్దలు కొట్టాడు. దాంతో ఆయనకు పెద్ద హీరోలు అవకాశాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. 

బుచ్చిబాబు ప్రస్తుతం రామ్ చరణ్‌ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది ఇంకా పట్టాలెక్కలేదు. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో కూడా సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా హమారాజ సినిమాతో మంచి హిట్ కొట్టాడు విజయ్ సేతుపతి. ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్ లో ఓ ఈవెంట్ నిర్వహించారు. 

ఇందులో బుచ్చిబాబు కూడా పాల్గొన్నారు. అయితే ఈవెంట్ కు విజయ్ సేతుపతి రాగానే లేచి ఆయన కాళ్లకు మొక్కాడు బుచ్చిబాబు. దాంతో ఈ  వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక స్టార్ డైరెక్టర్ హీరో కాళ్లు మొక్కడం ఏంటని అంతా షాక్ అవుతున్నారు. అయితే ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి నటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే ఇద్దరి నడుమ మంచి బాండింగ్ ఉంది.