Devara: ‘టైగర్ కా హుకూం’ పాట మర్చిపోతారు.. నిర్మాత ట్వీట్..!
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే జైలర్ మూవీలో ‘టైగర్ కా హుకూం’ అంటూ మాస్ ఆడియన్స్‌కు మంచి కిక్ ఇచ్చాడు. ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు ఎన్టీఆర్ దేవరకు పాటలు అందిస్తున్నాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సినిమా ‘దేవర’. డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ కెరీర్‌లో ‘దేవర’ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ అని మూవీ టీమ్ చెబుతోంది. ఇదిలా ఉంటే మే 20 ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా దేవర నుంచి అదిరిపోయే సాంగ్ విడుదల చేయనున్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే జైలర్ మూవీలో ‘టైగర్ కా హుకూం’ అంటూ మాస్ ఆడియన్స్‌కు మంచి కిక్ ఇచ్చాడు. ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు ఎన్టీఆర్ దేవరకు పాటలు అందిస్తున్నాడు. ఎన్టీఆర్ బర్త్ డేకు ఓ స్పెషల్ సాంగ్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాత నాగవంశీ ఎక్స్ వేదికగా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.
మే 19న దేవర ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుందని తెలియజేస్తూ నాగవంశీ ఇలా రాసుకొచ్చారు. ‘రజనీకాంత్ ‘జైలర్'లో'హుకుం' సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేవర సినిమా నుంచి రాబోయే సాంగ్ “హుకుం”ని మించి ఉంటుంది.. అనిరుధ్ అందించిన ఈ మాస్ సాంగ్ వేరే లెవెల్‌లో ఉంటుంది’ అంటూ నాగవంశీ ట్వీట్‌లో పేర్కొన్నారు. 'దేవర ముంగిట నువ్వెంత..’ అంటూ ఫైర్ ఎమోజీ పెట్టారు. ఈ లైన్‌తోనే ఆ పాట ఉండనున్నట్లు తెలుస్తోంది.