బర్త్ డే పార్టీ అనుకొని వెళ్లా.. ప్లీజ్ వదిలేయండి అంటున్న అషి రాయ్
ప్రస్తుతం తెలుగు రాజకీయ వర్గాలను, తెలుగు సినీ పరిశ్రమను షేక్ చేస్తున్న విషయం బెంగళూరు రేవ్ పార్టీ. ఈ పార్టీకి చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారని టాక్ వినిపిస్తోంది. మొత్తం 200 మంది పార్టీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే.. ప్రతీ రోజు కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. ఒకొక్కరుగా బయటకు రావడంతో ఇది చర్చానీయంశంగా మారిపోయింది. మొదట నుంచి నటి హేమ పేరు బయటకు వచ్చింది. తాను హాజరుకాలేదని ఆమె నమ్మించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. హేమ హాజరైందని పోలీసులు ఆధారాలు చూపించారు.
తర్వాత నటి, యాంకర్ శ్యామల పేరు కూడ గట్టిగానే వినిపించింది. అయితే, ఆమె ఓ వీడియో రిలీజ్ చేసి.. తాను హాజరుకాలేదని చెప్పారు. రాజకీయ కక్షల్లో భాగంగా తన పేరును బయటకు తీస్తున్నారని ఆమె మండిపడింది. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. ఇక.. ఆ తర్వాత వరుసలో టాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆషి రాయ్ కూడా పాల్గొందని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పోలీసులు కూడా ఆషి నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది.
దీనిపై ఆమె స్పందించింది. ఆమెపై వస్తున్న వార్తలను ఆషి ఖండించలేదు. పార్టీకి హాజరయ్యానే చెప్పింది. కానీ.. బర్త్ డే పార్టీ అని పిలిస్తే వెళ్లి వచ్చానని చెప్పుకొచ్చింది. ఈ ఈవెంట్ నిర్వహించిన వాసు తనకు బ్రదర్ లాంటివాడని.. పుట్టిన రోజు అని చెప్తే.. కేక్ కట్ చేసి వచ్చానని అన్నారు. అంతకు మించి తనకు ఏం తెలియదని ఆమె ఓ వీడియో రిలీజ్ చేశారు. ఎవరూ తప్పడు వార్తను రాయొద్దని చెప్పారు. తనకు సహకారించాలని కోరుతూ ఎమోషనల్ అయ్యారు.