రష్మికను వరించిన మరో క్రేజీ ఆఫర్... సర్ ప్రైజ్ అంటూ రివీల్

రష్మికను వరించిన మరో క్రేజీ ఆఫర్... సర్ ప్రైజ్ అంటూ రివీల్

విశ్వంభర, సినిమా :  రష్మికను మరో క్రేజీ ఆఫర్ వరించింది. దీంతో అమ్మడు ఆనందంలో మునిగితేలుతుంది. ఈ సర్ ప్రైజ్ మీ కోసమే అంటూ తనకు వచ్చిన ఆఫర్ ను తన ఫాలోవర్స్ తో పంచుకుంది. సికిందర్ సినిమాతో మీ ముందుకు వస్తున్న, ఇంత గొప్ప ప్రాజెక్ట్ లో నటించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా, గౌరవంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తమిళ దర్​శకుడు ఎ.ఆర్ మురగదాస్ దర్శకత్వంలో నడియాడ్ వాలా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో మొదట కియారా ఆడ్వాణీ కథానాయికగా ఎంపికైనట్లు వార్తలు వచ్చినా తాజాగా రష్మీకను తీసుకున్నట్లు టీమ్ పోస్ట్​ చేసింది. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Posts