ఆ వార్తలన్నీ ఫేక్.. టీటీడీ చైర్మన్ పదవిపై నాగబాబు

ఆ వార్తలన్నీ ఫేక్.. టీటీడీ చైర్మన్ పదవిపై నాగబాబు

పార్టీ నుంచి ప్రకటన వస్తనే నమ్మాలంటూ సూచన
ఏదో ఒక పదవి ఖాయం అంటున్న జనసైనికులు

ఏపీలో కూటమి భారీ విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీదే కీలక పాత్ర అయిపోయింది. ఎందుకంటే కూటమి గెలుపులో పవన్ కల్యాణ్‌ ది కీలక పాత్ర. అందుకే పవన్ కల్యాణ్‌ తర్వాత జనసేనలో కలకంగా ఉన్న ఆయన అన్న నాగబాబుకు ఏదైనా కీలక పదవి లభిస్తుందేమో అనే ప్రచారం మొదలైంది. 

ఇందులో భాగంగానే ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి వస్తుందని ఉదయం నుంచి ప్రచారం జరుగుతోంది. మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా వాటిపై ఆయన స్పందించారు. తనకు టీటీడీ చైర్మన్ పదవి అంటూ వస్తున్న వార్తలన్నీ ఫేక్ అంటూ కొట్టి పారేశారు. తన నుంచి గానీ, పార్టీ నుంచి గానీ ప్రకటన వస్తేనే నమ్మాలంటూ ఆయన చెప్పారు. 

Read More అక్కినేని నాగార్జున కేసు విత్ డ్రా చేసుకున్నారు.

అయితే కూటమి ప్రభుత్వంలో జనసేనది కీలక పాత్ర కాబట్టి.. కచ్చితంగా నాగబాబుకు ఏదో ఒక పదవి అయితే వస్తుందని అంతా నమ్మకంతో ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Related Posts