ఘనంగా మార్కండేయ జయంతి ఉత్సవాలు
On
విశ్వంభర,తానాజీ నగర్,ఉప్పుగూడ - పద్మశాలిసేవా భవనం ట్రస్ట్ 38వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పద్మశాలి సంక్షేమ సంఘం తానాజీ నగర్ ఉప్పుగూడలో మార్కండేయ పూజ, గాయత్రి హోమం, ప్రతిభా పురస్కారాలు, అన్నదానం,పద్మశాలి మహిళా కుటుంబ సభ్యులకు DR నామని ఈశ్వర్ చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లలితా బాగ్ ఎంఐఎం కార్పొరేటర్ అజం భాయ్ మాట్లాడుతూ నూలు పోగు తో బట్టలు తయారు చేయడంలో మీ పాత్ర ఎంతో ఉందని పద్మశాలీయుల గురించి చాలామంది తెలియదని కొన్ని విషయాలు తెలుసుకోవడం వల్ల నాకు కొంత తెలిసిందని చెప్పుకొచ్చారు మీ పద్మశాలి భవనానికి కావాల్సిన నిధులు ఎంపీ,MLA దగ్గర మాట్లాడి నిధులు ,విడుదల చేయించడానికి కృషి చేస్తానని చెప్పారు. పద్మశాలి కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



