ఈ టిప్స్‌తో ఇంట్లో నుంచి బొద్దింకలను తరిమికొట్టండి..!

ఈ టిప్స్‌తో ఇంట్లో నుంచి బొద్దింకలను తరిమికొట్టండి..!

వంటగదిలో బొద్దింకలు ఎక్కువగా ఉంటాయి. మహిళలను ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఇది కూడా ఒకటి. ఉదయం కనిపించకపోయినా.. రాత్రి సమయంలో ఎక్కువగా సంచరిస్తుంటాయి.

వంటగదిలో బొద్దింకలు ఎక్కువగా ఉంటాయి. మహిళలను ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఇది కూడా ఒకటి. ఉదయం కనిపించకపోయినా.. రాత్రి సమయంలో ఎక్కువగా సంచరిస్తుంటాయి. కిచెన్‌లోని అన్ని వస్తువులు, సామగ్రిపై పాకుతుంటాయి. అయితే, బొద్దింకల కారణంగా బ్యాక్టీరియా పెరుగుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అయితే, నేచురల్ టిప్స్‌తో బొద్దింకల బెడద తగ్గించుకోవచ్చు.

 బొద్దింకలు ఎక్కువగా తిరిగే చోట బిర్యానీ ఆకుల పొడిని వేసి చల్లడం ద్వారా ఆ ఆకుల ఘాటు వల్ల.. మూలల్లో ఉండే బొద్దింకలు తగ్గిపోతాయి. బొద్దింకలు ఉండే చోట లెమన్ గ్రాస్, పెప్పర్ మెంట్ ఆయిల్, పుదీనా ఆయిల్ వంటి ఘాటు వాసన కలిగిన ఆయిల్స్ రెండు లేదా మూడు చుక్కల్ని చల్లుకోవడం ద్వారా కూడా బొద్దింకల నుంచి ఉపశమనం పొందవచ్చు. అదేవిధంగా బొద్దింకలను వదిలించుకునేందుకు బేకింగ్ సోడా సైతం చాలా ఉపయోగపడుతుంది. బేకింగ్ సోడా, చక్కెర కలిపి బొద్దింకలు తిరిగే చోట చల్లడంతో వాటిని నివారించుకోవచ్చు.

Related Posts