ఆ వ్యక్తి బర్డ్ ఫ్లూతో చనిపోలేదు: డబ్ల్యూహెచ్‌వో
ఇటీవల బర్డ్ ఫ్లూతో తొలి మరణం సంభవించిందని ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆ మాటను వెనక్కి తీసుకుంది. ఆ వ్యక్తి బర్డ్ ఫ్లూ వల్ల చనిపోలేదని తేల్చిచెప్పింది.
ఇటీవల బర్డ్ ఫ్లూతో తొలి మరణం సంభవించిందని ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆ మాటను వెనక్కి తీసుకుంది. ఆ వ్యక్తి బర్డ్ ఫ్లూ వల్ల చనిపోలేదని తేల్చిచెప్పింది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ తాజాగా ఓ ప్రకటనను విడుదల చేసింది. పూర్తి స్థాయి పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆ వ్యక్తికి దీర్ఘకాలిక మూత్రపిండ సమస్యలు ఉన్నట్లు గుర్తించామని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.
అదేవిధంగా టైప్ 2 మధుమేహం, రక్తపోటు సమస్యలు ఉన్నాయని వెల్లడించింది. మరోవైపు దేశంలో కొన్ని రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ వ్యక్తి లక్షణాలను బట్టి బర్డ్ ఫ్లూతో చనిపోయి ఉండవచ్చని భావించినట్లు తెలిపింది. అయితే, ఈ అతడి మరణానికి అనేక కారణాలు ఉన్నాయని వివరించింది. హెచ్ 5ఎన్ 2కి ఆపాదించబడిన మరణం కాదని స్పష్టం చేసింది.