అమెరికాలో అదృశ్యమైన తెలుగు విద్యార్థిని సేఫ్..!

అమెరికాలో అదృశ్యమైన తెలుగు విద్యార్థిని సేఫ్..!

అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థిని అదృశ్యం కాగా ప్రస్తుతం ఆ యువతి ఆచూకీ లభించింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన నితీశ కందుల అనే విద్యార్థిని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ, శాన్ బెర్నార్డినోలో చదువుతోంది. 

అయితే ఈ యువతి మే 28వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. ఆమె మొబైల్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో స్నేహితులు ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారత్‌లోని నితీషా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో సాయం కోసం వాట్సాప్‌ ద్వారా ఆమె కుటుంబ సభ్యులు అభ్యర్థించారు. అదృశ్యమైన నితీషా కనిపిస్తే +91 80749 62618 నంబర్‌కు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. 

Read More భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు..

దీంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా ఆ యువతి సురక్షితంగానే ఉన్నట్లు శాన్ బెర్నార్డినో పోలీసు శాఖ వెల్లడించింది. అమెరికాలో వివిధ కారణాలతో భారతీయ విద్యార్థులు అదృశ్యమవడం, ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నితీషా ఆచూకీ లభ్యం కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.