దావోస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి జ్యూరిచ్ చేరుకున్న ముఖ్యమంత్రి
- మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల ప్రతినిధి బృందం
- దావోస్ విమానాశ్రయంలో ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
- రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ
విశ్వంభర, దావోస్: దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి జ్యూరిచ్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ముఖ్యమంత్రి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల ప్రతినిధి బృందం జ్యూరిచ్ విమానాశ్రయం చేరుకోగానే అక్కడ స్థిరపడిన తెలుగు వారితో సందడి నెలకొంది. పెద్ద ఎత్తున హాజరై అభినందనలు తెలియజేశారు.
జ్యూరిచ్ విమానాశ్రయంలో రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరస్పరం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై వారి మధ్య చర్చ జరిగింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి శ్రీధర్ బాబు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కూడా ఉన్నారు.
దావోస్ సదస్సు తొలి రోజున పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. అంతర్జాతీయ పెట్టుబడుల గమ్య స్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసే నిర్దిష్టమైన భవిష్యత్తు ప్రణాళికతో ఈ పర్యటనపై రాష్ట్ర ప్రతినిధి బృందం ప్రత్యేకంగా దృష్టి సారించింది.