భారత్ పై అమెరికా ప్రశంసల జల్లు

భారత్ పై అమెరికా ప్రశంసల జల్లు

విశ్వంభర, వెబ్ డెస్క్ : భారత్ లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై అమెరికా ప్రశంసల వర్షం కురిపించింది. వైట్ హౌస్ జాతీమ భద్రతా సమాచారం సలహాదారు జాన్ కిర్బీ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ భారత్ ను కొనియాడారు. ప్రపంచంలో భారత్ కంటే శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం మరొకటి లేదని తెలిపింది.

భారతీయులు ఓటు వేయడంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పడం ప్రశంసనీయమని అన్నారు. "భారతదేశంలో 96 కోట్ల మంది ప్రజలు ఓటింగ్ ప్రక్రియ లో పాల్గొని 2660 గుర్తింపు పొందిన పార్టీల నుంచి అభ్యర్థులను ఎన్నుకుంటున్నారు. వేలాది మంది పోటీదారుల నుంచి 545 మంది పార్లమెంట్ సభ్యులను ఎన్నుకోబోతున్నారు". అని తెలిపారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Read More బ్రిటన్ లో ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు

Related Posts