నిరుద్యోగుల కోసం  ‘హరీశన్న ఉద్యోగ యాప్’ 

నిరుద్యోగుల కోసం  ‘హరీశన్న ఉద్యోగ యాప్’ 

  •  గూగుల్‌ప్లే స్టోర్‌లో అందుబాటులోకి రానున్న యాప్
  • 57పరీక్షలకు, 400నమూనా ప్రశ్నపత్రాలతో క్లాస్‌లు
  •  సొంత ఖర్చులతో యాప్ రూపొందించిన మాజీ మంత్రి
  •  నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు
  •  త్వరలో యాప్ ను  ప్రారంభించనున్న ఎమ్మెల్యే హరీశ్ రావు 

విశ్వంభర , సిద్దిపేట : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు నిరుద్యోగ యువత కోసం ఇప్పటికే పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టేందుకు యువతకు మరో గుడ్ గుడ్ న్యూస్ చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన 57రకాల పోటీ పరీక్షలకు సిద్ధం చేసేలా ‘హరీశన్న ఉద్యోగ యాప్’ రూపొందించారు. ఇందులో 2వేల గంటల వీడియో పాఠాలు, 400 నమూనా ప్రశ్నాపత్రాలు ఉంటాయి. ఉచితంగా తరగతులు వీక్షించే సదుపాయాన్ని త్వరలో ప్రారంభించనున్నారు. సిద్దిపేట నిరుద్యోగ యువత కోసం తన సొంత ఖర్చులతో యాప్‌ను రూపొందించారు. గతంలో గ్రూప్-1, గ్రూప్-2, పోలీస్ కానిస్టేబుల్, టెట్, ఉపాధ్యాయ పోటీలకు ఉచితంగా కోచింగ్‌లు ఇప్పించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న పలువురు యువతకు ఉద్యోగాలు పొందారు.  కాగా కొంతమంది హైదరాబాద్‌కు వెళ్లి కోచింగ్ తీసుకోవడం, రూమ్ కిరాయిలతో ఇబ్బందులు పడుతున్న దృష్టా ఉచిత కోచింగ్ తరహాలో ఆన్‌లైన్ క్లాస్‌లు వినే వీలుగా ఉద్యోగ యాప్‌ను ఏర్పాటు చేశారు. ఈ యాప్‌తో పేద విద్యార్థులకు మేలు జరగనుంది. నిరుద్యోగులకు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం తెలియని పరిస్థితి. పదో తరగతి నుంచి పీజీ వరకు అంతకుపైన చదివిన యువత కోసం ఉద్యోగాల కోసం ఈ  యాప్ ఎంతో ఉపయోగపడనుంది. 

57 రకాల పోటీ పరీక్షలకు ఆన్‌లైన్ క్లాస్‌లు: 

Read More ఉప్పుగూడ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో  సైన్స్ ఫెయిర్ 

సిద్దిపేట నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఏడాదిలో వేయి మందికి అవకాశం ఇవ్వనున్నారు. ఒకసారి రిజిస్టరైతే ఎన్నిసార్లైనా ఆన్లైన్ వీడియోలు చూడొచ్చు. 4వేల స్టడీ మెటీరియల్ పీడీఎఫ్ నిక్షిప్తం చేశారు. ఇది ఏడాదికి  యాక్టివేషన్ సదుపాయం ఉంటుంది. రోజూ టెస్టులుంటాయి. యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో డౌన్లోడ్ చేసుకోవాలి. సందేహాల నివృత్తికి సమయాన్ని నిర్దేశిస్తారు. రీజనింగ్, అర్థమేటిక్, ఆంగ్లం, కరెంట్ అఫైర్స్, చరిత్ర, రాజనీతి, ఆర్ధిక, భౌగోళిక తదితర ముఖ్యమైన సబ్జెక్టుల పాఠాలుంటాయి. తెలుగు, ఆంగ్ల భాషలలో చూసే సదుపాయం కలల్పించారు. ఉద్యోగ ప్రకటనలు,  క్యాంపస్ రిక్రూట్మెంట్లకు సైతం ఎప్పటికప్పుడు సమాచారం ఉండేలా యాప్‌‌ను రూపొందించారు.

ఆర్థిక వెసులుబాటు: 

ఉద్యోగం రాక ఒకవైపు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న యువత కోసం ఎదో చేయాలని సంకల్పింతో  మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఈ యాప్ ను రూపొందించారు.. ఉద్యోగం సాధించాలనే తపనతో హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు వెళ్లి కోచింగ్ తీసుకుని డబ్బులు, రూమ్ కిరాయి ఇలా దాదాపు రూ.50వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు చేసుకుని ఇబ్బందులు పడుతున్న వారికి ఈ యాప్ ఎంతో  ఉపయోగకరంగా ఉంటుంది.   యువత, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో నిరుద్యోగ యువత కోసం ఉచితంగా క్లాస్‌లు వినాలనే ఈ యాప్‌ను ఏర్పాటు చేశారు. యువత ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకుని ఉద్యోగం సాధించాలన్నదే  హరీశ్‌రావు ముఖ్య ఉద్దేశం.

Related Posts