ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు

*విశ్వంభర ఆమనగల్లు జూలై 8: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి వేడుకలు ఆమనగల్లు కడ్తాల్ మండల కేంద్రాల్లో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యర్యంలో ఆమనగల్ కూడలి (చౌరస్తా ) ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పిసిసి కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అపరభగీరతుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజలు గుండెల్లో శాశ్వతం గా నిలిచిపోయాయని అన్నారు. పేద ప్రజల కోసం వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి నిరంతరం పరితపించేవారని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పరితపించి పేద ప్రజలకు సుపరిపాలన అందించిన మహానేత వైఎస్ఆర్ అని కొని యాడారు.
ప్రతి పేదవాడి గుండెల్లో రాజశేఖర్ రెడ్డి ఉన్నారని రాష్టం లో మైనారిటీ లకు 4% రిజర్వేషన్ తెచ్చింది రాజశేఖర్ రెడ్డి అని అపదలో ఫోన్ చేస్తే 108,104 కుయ్ కుయ్ అంటు ప్రతి గ్రామం లో పేదల చెంతన ప్రత్యేక్షం అవుతున్నయంటే వైయస్సార్ చలువే అన్నారు ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ అనిత విజయ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నరసింహ గూడూరు శ్రీనివాస్ రెడ్డి మండల అధ్యక్షులు జగన్, బిచ్య నాయక్, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు ధనంజయ, పులి కంటి మైసయ్య, కాలే మల్లయ్య, వస్పుల మానయ్య, జంతుక యాదయ్య, కృష్ణ నాయక్, ఖాదర్, ఎండి అలీమ్, సురేష్, మహేష్, నాజర్ మల్లేష్ తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.



