నారా భువనేశ్వరి కి ఘన స్వాగతం పలికిన గద్దె విజయ్ నేత

నారా భువనేశ్వరి కి ఘన స్వాగతం పలికిన గద్దె విజయ్ నేత

విశ్వంభర, హైదరాబాద్:-  లండన్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును మరియు గోల్డెన్ పీకాక్ అవార్డునూ అందుకొని స్వదేశానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కి డా. పొగాకు జయరాం  ఆధ్వర్యంలో తెలుగు యువత నాయకులు, సామాజిక కార్యకర్త, బి.ఎన్.రెడ్డి టిడిపి కాంటెస్టెడ్ కార్పొరేటర్ గద్దె విజయ్ నేత అభిమానులతో కలిసి శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం పలికారు. గద్దె విజయ్ నేత  నారా భువనేశ్వరి కి మర్యాదపూర్వకంగా శాలువా ను కప్పి శుభాకాంక్షలు తెలియజేసారు.  తెలుగు వారి ఖ్యాతి నీ ఖండంతరాలకు చేరుస్తూ భారతదేశ, తెలుగు వారి గొప్పతనాన్ని చాటుతున్న చంద్రబాబు కుటుంభ సభ్యులకు, నేతలకు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్ రావు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, సన్నిహితులు పాల్గొన్నారు.

Tags: