హైదరాబాద్‌లో విరాట్ కోహ్లీ కొత్త రెస్టారెంట్.. ఎక్కడో తెలుసా..?
ఇప్పటికే కోహ్లీకి న్యూవా, వన్8 కమ్యూనీ పేరిట రెస్టారెంట్లు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా వన్8 కమ్యూనీకి సంబంధించి కొత్త బ్రాంచ్‌ను హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ప్రారంభించాడు కోహ్లీ. ఇక ఈ ఓపెనింగ్ వేడుకకు ఆర్‌సీబీ ఆటగాళ్లు వచ్చి సందడి చేశారు.
మైదానంలో పరుగుల వరద పారించే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ క్రికెట్‌తో పాటు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నాడు. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, పూణే, కలకత్తా, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో రెస్టారెంట్‌లను నడుపుతున్న కోహ్లీ తాజాగా హైదరాబాద్‌లో ఓ బ్రాంచ్‌ను ఇవాళ(శుక్రవారం) ప్రారంభించాడు.
ఇప్పటికే కోహ్లీకి న్యూవా, వన్8 కమ్యూనీ పేరిట రెస్టారెంట్లు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా వన్8 కమ్యూనీకి సంబంధించి కొత్త బ్రాంచ్‌ను హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ప్రారంభించాడు కోహ్లీ. ఇక ఈ ఓపెనింగ్ వేడుకకు ఆర్‌సీబీ ఆటగాళ్లు వచ్చి సందడి చేశారు.
కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “One 8 Commune” కు రావాలంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుడ్ లవర్స్‌కు స్వాగతం పలికాడు కోహ్లీ. 2017 నుంచి కోహ్లీ ఈ ఫుడ్ బిజినెస్‌ను ఢిల్లీ, ముంబై, పూణే, కలకత్తా, బెంగళూరు నగరాల్లో మొదలుపెట్టాడు. తొలిసారి హైదరాబాద్‌లో తన ఫుడ్ బిజినెస్‌ను ప్రారంభించాడు.
హైదరాబాద్‌లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్.. నేడే ప్రారంభం. pic.twitter.com/6bO1sgqRjU
— Telugu Scribe (@TeluguScribe) May 24, 2024