మున్నూరు కాపు గ్రామ అధ్యక్షుడిగా శ్రీనివాస్.
On
విశ్వంభర భూపాలపల్లి జూలై 22 : - జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామ మున్నూరు కాపు అధ్యక్షుడిగా సుంకరి శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
కార్యవర్గ సభ్యులుగా
పిడుగు సమ్మయ్య, తాటికొండ శ్రీనివాస్,తాటికొండ రాజులు,దిండిగల నర్సయ్య లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మున్నూరు కాపుల సమస్యలపై దృష్టి సాధించి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. మున్నూరు కాపులకు ప్రభుత్వం తరఫున వచ్చే అభివృద్ధి పథకాలను వారికి చేరే విధంగా కృషి చేస్తానని అన్నారు. అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.