జులై 15వ తేదీన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక

bodupal 2 విశ్వంభర మేడిపల్లి జులై 10 :-  మేడ్చల్ జిల్లా  బోడుప్పల్ నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్ధసారథి నోటిఫికేషన్ జారీ చేశారు. జులై 15వ తేదీన ప్రత్యేక సమావేశం నిర్వహించి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ ద్వారా ప్రత్యేకంగా అధికారం పొందిన ప్రత్యేక గెజిటెడ్ స్థాయి అధికారి ఈ ఎన్నికను నిర్వహించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.