Telangana: రాష్ట్రంలో తొలి ట్రిపుల్ తలాక్ కేసు.. ఎక్కడంటే..!!

Telangana: రాష్ట్రంలో తొలి ట్రిపుల్ తలాక్ కేసు.. ఎక్కడంటే..!!

తెలంగాణలో తొలి ట్రిపుల్ తలాక్ కేసు నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పగా కేసు నమోదు చేసినట్లు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస్ వెల్లడించారు.

ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేస్తూ 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా తెలంగాణలో తొలి ట్రిపుల్ తలాక్ కేసు నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పగా కేసు నమోదు చేసినట్లు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీకి చెందిన జాస్మీన్ అనే మహిళకు అబ్దుల్ అతిక్తో 2017లో వివాహమైందన్నారు. 

భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో గతేడాది ఫిబ్రవరిలో అబ్దుల్ అతిక్‌పై వేధింపుల కేసు నమోదైంది. అప్పటి నుంచి భర్తకు దూరంగా ఉంటూ పోషణ కోసం కోర్టులో కేసు వేయగా, నెలకు రూ.7 వేలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే అతీక్ కోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయలేదు. నాలుగు నెలలుగా భార్యకు డబ్బులు ఇవ్వకుండా ఆమె ఫోన్ చేసిన లిప్ట్ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నాడు. మళ్లీ కేసు పెడతానని భార్య అనడంతో అతడు ట్రిపుల్ తలాక్ ఇస్తున్నట్లు ఈ నెల 11న వాట్సాప్ ద్వారా రెండు నిమిషాల నిడివితో మెసేజ్ పంపాడు.

Read More వేసవి ఉపశమనం కోసం చల్లటి నీరు ,  మజ్జిగ పంపిణీ  - - చర్లపల్లిలో ప్రారంభించిన ఎక్‌ కదమ్ ఫౌండేషన్

ఇక నుంచి నీకు నాకు సంబంధం లేదు అని చెప్పి వాట్సప్ మెసేజ్ భార్య ఫోన్‌కు పంపాడు. దీంతో ఆగ్రహించిన బాధితురాలు శనివారం మహిళా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. ఈ మేరకు అతిక్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్ స్పెక్టర్ వివరించారు.కాగా సుప్రీంకోర్టు 2019లో 3:2 మెజారిటీతో ముస్లింలలో ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు తీసుకునే ఆచారం చెల్లదని, చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్దమని తీర్పునిచ్చింది. త్రిబుల్ తలాక్ చెప్పిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది.

Advertisement

LatestNews