నకిలీ ఆధార్‌తో పార్లమెంట్‌లోకి చొరబడే యత్నం.. ముగ్గురి అరెస్ట్

నకిలీ ఆధార్‌తో పార్లమెంట్‌లోకి చొరబడే యత్నం.. ముగ్గురి అరెస్ట్

లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ రోజు(జూన్4) ఢిల్లీలో అనూహ్య పరిణామం జరిగింది. ముగ్గురు దుండగులు నకిలీ ఆధార్ కార్డుతో  పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేశారు.

లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ రోజు(జూన్4) ఢిల్లీలో అనూహ్య పరిణామం జరిగింది. ముగ్గురు దుండగులు నకిలీ ఆధార్ కార్డుతో  పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేశారు. వారిని అక్కడ ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పార్లమెంట్ భవనం వద్ద గేట్ నంబర్ 3 నుంచి ఖాసీం, మోసిన్, షోయబ్ అనే ముగ్గురు వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. 

జూన్ 4వ తేదీన మధ్యాహ్నం 1.30గంటలకు ఈ ఘటన జరగగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ప్రవేశ ద్వారం వద్ద భద్రతా సిబ్బంది అతని ఆధార్ కార్డును తనిఖీ చేయగా సిబ్బందికి వారికి అనుమానం వచ్చింది. విచారణ అనంతరం ఆధార్ కార్డు నకిలీదని తేల్చారు. అనంతరం ఆ ముగ్గురిని వెంటనే అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. 

Read More పోలీసులపై వైద్యురాలి తల్లితండ్రులు సంచలన ఆరోపణలు

ఈ ఘటన తర్వాత పార్లమెంట్ హౌస్ భద్రత బాధ్యతను సీఆర్పీఎఫ్, ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లోపల ఎంపీ లాంజ్ నిర్మాణ పనుల కోసం ముగ్గురు కూలీలను నియమించినట్లు సమాచారం. గత డిసెంబర్ నెలలోనూ దుండగులు పార్లమెంట్‌లోకి ప్రవేశించి పొగగొట్టాలతో సభ్యులను భయబ్రాంతులకు గురిచేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీంతో భద్రతాసిబ్బంది అప్రమత్తమైంది. పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

Related Posts