మామతో కలిసి భర్తనే చంపేసిన భార్య

మామతో కలిసి భర్తనే చంపేసిన భార్య

 

 

కట్టుకున్న భర్తలనే ఈ నడుమ కొందరు కసాయి భార్యలు కడతేరుస్తున్నారు. ఇప్పుడు కూడా కామారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘోరమే వెలుగు చూసింది. జిల్లాలోని బాన్సువాడ మండలం తిర్మలాపూర్‌లో రాములు అనే వ్యక్తికి మంజులతో పెళ్లి అయింది. అయితే ఏమైందో తెలియదు గానీ.. రాములు తండ్రి నారాయణతో కలిసి భార్య మంజుల అతన్ని చంపేసింది. 

కట్టుకున్న భర్తను మంజుల, నారాయణ నరికి మరీ చంపేశారు. ఆ తర్వాత ఇంటి పక్కనే ఉన్న పాడుబడ్డ ఇంటిలోని నీటిట్యాంకులో పడేశారు. దుర్వాసన వస్తోందని ఆ ఇంటి ముందే గొయ్యి తీసి పాతిపెట్టారు. ఏమీ ఎరగనట్టు పోలీసులకు తన భర్త కనిపించట్లేదని ఫిర్యాదు చేసింది. 

కాగా ఆ శవం దుర్వాసన రావడంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అనుమానం వచ్చిన పోలీసులు భార్యనే నిందితురాలిగా తేల్చారు. కుళ్లిన స్థితిలో రాములు మృతదేహాన్ని బయలకు తీశారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం రేపుతోంది. ఇక మంజుల, రానాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

Related Posts

Advertisement

LatestNews

విజయవంతమైన ఉచిత మెగా వైద్య శిబిరం - ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన
చండూర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం - డా. కోడి శ్రీనివాసులు సహకారంతో పేద ప్రజలకు వైద్య సేవలు 
ఘనంగా చండూర్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ - -ఆవిష్కరించిన  మున్సిపల్ అధ్యక్షులు కొత్తపాటి సతీష్ 
మంత్రిని కలిసిన పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ , వైస్ చైర్మన్  - పోచంపల్లి బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానం 
జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
అన్యాయాన్ని  ప్రశ్నించే వారే కదలాలి - -బి ఎస్ రాములు సామాజిక తత్వవేత్త. బీసీ కమిషన్ తొలి చైర్మన్. 
AIPSO ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు నివాళులు