టాలీవుడ్ నటుడు వేణుపై కేసు నమోదు.. కారణమేంటంటే..?

టాలీవుడ్ నటుడు వేణుపై కేసు నమోదు.. కారణమేంటంటే..?

 ఉద్దేశపూర్వకంగా మోసం చేసి మొత్తం డబ్బు తీసుకోవాలని ప్రయత్నిస్తున్న ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ ప్రతినిధులపై రిత్విక్ ప్రాజెక్ట్స్ ఉపాధ్యక్షుడు టి.రవికృష్ణ గురువారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

టాలీవుడ్ నటుడు వేణుపై బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సినీ నటుడు తొట్టెంపూడి వేణు, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యులు ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థను నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ పనిని తెహ్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీహెచీసీ) ద్వారా ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ ప్రాజెక్ట్‌ను దక్కించుకొంది.

ఈ పనిని బంజారాహిల్స్ లోని రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ, స్వాతి కన్స్ట్రక్షన్స్ సంస్థలు ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ సంస్థ నుంచి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ ప్రొజెట్ సంబంధించి స్వాతి కన్‌స్ట్రక్షన్ మధ్యలోనే ఆ పని నుంచి తప్పుకోగా రిత్విక్ ప్రాజెక్ట్స్ 2002లో పనులు మొదలు పెట్టింది. 450 కోట్లను టీహెచ్సీ అందించగా ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్‌కి, తెహ్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు మధ్య ఏర్పడిన వివాదం నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

Read More సినిమా నడుస్తుండగానే వర్షం.. తడిసి ముద్దయిన ప్రేక్షకులు.. వీడియో ఇదిగో!

ఆ తర్వాత మిగిలిన పనులకు రూ.1,010 కోట్ల రూపాయలు విడుదల కాగా డబ్బు తెహ్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో జమ చేసింది. ఒప్పందం ప్రకారం వాటాలు తీసుకోవాల్సి ఉండగా సినీ నటుడు తొట్టంపూడి వేణు, ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ ప్రతినిధి, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కుమారుడు కావూరి భాస్కర్‌రావు, మరో ప్రతినిధి, కావూరి భాస్కర్రావు తల్లి, పీసీఎల్ సంస్థ డైరక్టర్ కె.హేమలత, సోదరి శ్రీవాణిలతో పాటు సంస్థ మేనేజింగ్ డైరక్టర్ ప్రవీణ్ పాతూరిలు రిత్విక్ ప్రాజెక్ట్స్ చేసుకున్న ఒప్పంద హక్కులను రద్దు చేశారు.

దీంతో వారు ఉద్దేశపూర్వకంగా మోసం చేసి మొత్తం డబ్బు తీసుకోవాలని ప్రయత్నిస్తున్న ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ ప్రతినిధులపై రిత్విక్ ప్రాజెక్ట్స్ ఉపాధ్యక్షుడు టి.రవికృష్ణ గురువారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో మొత్తం ఐదుగురిపై 406, 420, 506 సెక్షన్ల కింద రెడ్ విత్ 34 కింద కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts