కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా

కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా

ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. బెయిల్‌పై మే 27న కౌంటర్ దాఖలు చేయనున్నట్లు సీబీఐ తెలిపింది. 

ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. బెయిల్‌పై మే 27న కౌంటర్ దాఖలు చేయనున్నట్లు సీబీఐ తెలిపింది. అలాగే జూన్ 7న ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు కోర్టుకు వెల్లడించింది. 

మరోవైపు కవిత బెయిల్ పిటిషన్‌పై ఈడీ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఈడీ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. 

Read More ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి

అదేవిధంగా ఈడీ అరెస్టు చేసిన విధానం, కేసులో కవిత పాత్ర గురించి దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలపై కోర్టుకు కవిత తరపు న్యాయవాది వివరించారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం లోపు కౌంటర్ కాపీని కవిత న్యాయవాదికి మెయిల్ ద్వారా ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. సోమవారం రెండు కేసుల్లో కవిత తరపు వాదనలు పూర్తి చేయాలని ఆదేశించింది.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా