'నటి' హేమకు మరోసారి నోటీసులు!
రేవ్ పార్టీ కేసులో నటి హేమకు మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. హేమతో పాటు మరో 8 మందికి పంపినట్టు తెలుస్తోంది. జూన్ 1న విచారణకు హాజరుకావాలని బెంగళూరు సీసీబీ పోలీసులు ఆదేశించారు. ఈ కేసులో ఇది వరకే హేమకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మే 27న హాజరుకావాలని తెలిపారు. కానీ, ఆరోగ్యం బాలేదని.. విచారణకు హాజరు కాలేనని ఆమె పోలీసులకు లెటర్ రాశారు.
రేవ్ పార్టీకి హేమ హాజరైనట్టు.. అక్కడ ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆమెతో పాటు 86 మంది రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడినట్లు ఇటీవల తేల్చారు. దీంతో ఈ కేసు విచారణలో పోలీసులు దూకుడు పెంచారు. మొదటి నుంచి హేమ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొదట ఆమె అసలు రేవ్ పార్టీకి హాజరుకాలేదని చెప్పారు. హాజరుకాలేదని.. తన పేరు ఎందుకు వస్తుందో తెలియదని ఓ వీడియో రిలీజ్ చేశారు. అయితే, ఆమె హాజరైనట్టు పోలీసులు ఫోటోను రిలీజ్ చేసి ఆధారాలు బయట పెట్టారు. ఆ తర్వాత హేమ మీడియాపై చిందులు వేశారు.
ఇక.. విచారణకు రావాలని ఆమెను పోలీసులు ఆదేశిస్తూ నోటీసులు పంపారు. కానీ, ఆమె హాజరు కాలేదు. జర్వం కారణంగా హాజరుకాలేనని చెప్పారు. ఆ తర్వాత ఆమె ఓ వీడియో రిలీజ్ చేశారు. తప్పు చేయకపోవడానికి మనం ఏమైనా దేవుళ్లుమా? అని అన్నారు. చేసిన తప్పును అంగీకరించాలని ఆమె తెలిపారు. తప్పు నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తే 100 అబద్దాలు ఆడాల్సి వస్తుందని అన్నారు. దీంతో... డ్రగ్స్ తీసుకున్నానని ఆమె ఒప్పుకున్నారని నెటిజన్లు కామెంట్ చేశారు. అయితే, మొదటిసారి విచారణకు హాజరుకాలేదు. న్యాయపోరాటం చేస్తానని కూడా చెప్పారు. మరి ఈసారి హాజరవుతారా? లేదా చూడాలి.