హైదరాబాద్‌లో మరో దారుణం.. మాజీ ఎంపీటీసీ హత్య

హైదరాబాద్‌లో మరో దారుణం.. మాజీ ఎంపీటీసీ హత్య

  • మృతదేహాన్ని డంపింగ్ యార్డులో పాతిపెట్టిన వైనం
  • పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు 
  • హత్యకు వివాహేతర సంబంధమే కారణం?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతిభద్రతలు క్రమంగా క్షీణిస్తున్నట్లు కనిపిస్తోంది. రోజూ ఎక్కడో ఒక చోట హత్యలు, లైంగికదాడులు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో హత్యా ఘటనలు ఆగడంలేదు. తాజాగా హైదరాబాద్ శివారులో మరో దారుణం జరిగింది. ఓ మాజీ ఎంపీటీసీ దారుణ హత్యకు గురయ్యాడు. 

ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే మాజీ ఎంపీటీసీ మహేశ్ (40) ఈ నెల 17న బయటకువెళ్లి తిరిగిరాలేదు. దీంతో ఆయన సోదరుడు విఠల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. తాజాగా ఎన్ఎఫ్‌సీ నగర్ డంపింగ్ యార్డు వద్ద  ఎఫ్సి నగర్ డంపింగ్ యార్డు వద్ద మహేశ్ మృతదేహం గుర్తించారు. విచారణలో భాగంగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. నిందితులు గడ్డం మహేష్‌ను హత్య చేసి ఘట్‌కేసర్ డంపింగ్ యార్డ్‌లో పాతి పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధం కారణంగా మాజీ ఎంపీటీసీ మహేష్‌ హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read More మంత్రి ఉత్తమ్ తండ్రికి  మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాళులు