కొడుకుని కిరాతకంగా కొట్టి చంపిన తండ్రి

కొడుకుని కిరాతకంగా కొట్టి చంపిన తండ్రి

విశ్వంభర, చిన్నశంకరంపేట : బెట్టింగ్ కు అలవాటు పడిన కుమారుడిని ఎన్ని సార్లు మందలించిన వినకపోగ 2 కోట్లకు పైగా అప్పులు చేయడంతో విసిగిపోయిన తండ్రి కిరాతంగా హత్య చేసిన సంఘటన చిన్నశంకరంపేట మండలం భాగిర్తి పల్లిలో చోటుచేసుకుంది. 

పోలీసుల కథనం మేరకు కుటుంబీకుల  వివరాలు ఇలా ఉన్నాయి. శంకరంపేట గ్రామపంచాయతీ ఆమ్లెట్ గ్రామమైన భాగిర్తిపల్లి గ్రామానికి చెందిన రెడ్డి సత్యనారాయణ  రైల్వే ఉద్యోగి. అతని కుమారుడు రెడ్డి ముఖేష్( 28) క్రికెట్ బెట్టింగ్ కు అలవాటు పడ్డాడు. వద్దని కుమారున్ని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా రెండు కోట్లకు పైగా అప్పులు చేశాడు. విసికెత్తిన తండ్రి సత్యనారాయణ ముఖేష్ నిద్రిస్తుండగా రాడుతో కొట్టి చంపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read More  All India Pregnant Job: ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్.. ఇదో కొత్తరకం మోసం..!!

Tags: Murder

Related Posts