బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కుటుంబ సభ్యులపై కేసు !

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కుటుంబ సభ్యులపై కేసు !

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్లలో కేసు నమోదైంది. తన భూమిని కబ్జా చేశారంటూ ఓ వ్యక్తి చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్లలో కేసు నమోదైంది. తన భూమిని కబ్జా చేశారంటూ ఓ వ్యక్తి చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనపై మారణాయుధాలతో బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు జీవన్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాల ప్రకారం.. ఎర్లపల్లిలో 20 ఎకరాల 20 గుంటల భూమిని 2022లో దామోదర్ రెడ్డి అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. సర్వే నెంబర్ 32, 35, 36, 38 లో ఫంక్షన్ హాల్ నిర్మించుకున్నాడు. అయితే, దామోదర్ రెడ్డి భూమికి పక్కనే జీవన్ రెడ్డి భూమి ఉంది. 2023లో ఫంక్షన్ హాల్‌ను కూల్చేసి దామోదర్ రెడ్డి భూమిని జీవన్ రెడ్డి కబ్జా చేసినట్లు సమాచారం. 

Read More డిగ్రీ కళాశాలకు చైర్లు, ఇతర సామాగ్రి బహుకరణ

అయితే, కబ్జా చేసిన భూమికి రక్షణగా పంజాబీ గ్యాంగ్‌ను జీవన్ రెడ్డి కాపలా పెట్టాడు. తన ఫంక్షన్ హాల్ కూల్చేయడంతో నిలదీసేందుకు వెళ్లిన దామోదర్ రెడ్డిపై దాడికి దిగారు పంజాబీ గ్యాంగ్.. మారణాయుధాలు చూపించి దామోదర్ రెడ్డిని.. జీవన్‌రెడ్డి అనుచరులు బయభ్రాంతులకు గురిచేశారని బాధిడుతు తెలిపాడు. దీంతో జీవన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై చేవెళ్ల పోలీసులు ఆరు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.