కాన్వాయ్ వెంట మహిళ పరుగులు.. కారు ఆపి మాట్లాడిన చంద్రబాబు 

కాన్వాయ్ వెంట మహిళ పరుగులు.. కారు ఆపి మాట్లాడిన చంద్రబాబు 

ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు అందరి అభిమానాన్ని చూరగొంటున్నారు. విజయవాడలో కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వెళ్లిన చంద్రబాబుకు ఊహించని సంఘటన ఎదురైంది.

ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు అందరి అభిమానాన్ని చూరగొంటున్నారు. విజయవాడలో కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వెళ్లిన చంద్రబాబుకు ఊహించని సంఘటన ఎదురైంది. సమావేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడుని చూసేందుకు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌కు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. టిక్కిల్‌ రోడ్డులో పెద్ద ఎత్తున బారులు తీరారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా స్వాగతం పలికారు. ఓ మహిళ చంద్రబాబు కాన్వాయ్‌ వెంట పరుగులు తీసింది. 

110624galmshhtd1

Read More పారా లీగల్ వాలంటీర్లు వారధిలా ఉండాలి : జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశిధర్ రెడ్డి.

చంద్రబాబును చూడ్డానికి కాన్వాయ్ వెంట పరుగులు తీసింది. బాబును చూడాలి అంటూ కాన్వాయ్ వెంట మహిళ రావడాన్ని చంద్రబాబు గమనించారు. వెంటనే కారును ఆపి ఆ మహిళతో మాట్లాడారు. సెక్యూరిటీని వారించి ఆమె వివరాలు తెలుసుకున్నారు. మా కష్టం ఫలించి.. సార్. మా కోరిక మేరకు మీరు సీఎం అయ్యారంటూ కాళ్లు మొక్కుతా అంటూ చంద్రబాబు కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేసింది. చంద్రబాబు సున్నితంగా వారించారు. ఆమెతో ఆప్యాయంగా మాట్లాడి ఫొటో దిగారు. 

తనకు జ్వరం ఉన్నా చూడాలని వచ్చానని నందిని చెప్పగా ముందు ఆసుపత్రికి వెళ్లాలని చంద్రబాబు సూచించారు. ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకుని అవసరమైన వైద్యం సాయం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యేలతో సమావేశంలో వేదికపై ప్రత్యేక కుర్చీని ఏర్పాటు చేయగా అందరితో పాటు తనకు సమానమైన కుర్చీ వేయాలని సిబ్బందికి సూచించి ఆశీనులయ్యారు. ఇలా చంద్రబాబు తనదైన మంచిమనసుతో అందరి మనసులు దోచుకుంటున్నారు.