ఏపీ ఉద్రిక్తతలపై చంద్రబాబు ఘాటు రియాక్షన్… వారికి స్పెషల్ రిక్వెస్ట్
విశ్వంభర, వెబ్ డెస్క్ : ఏపీ ఎలక్షన్ సందర్భంగా సోమవారం పలు చోట్ల ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఘటన పై టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు వైసీపీ దాడులను ఖండిస్తూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. “నిన్నటి పోలింగ్ లో వైసీపీ గూండాల దాడులను ధైర్యంగా ఎదిరించిన తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు. ప్రజలపై పోలింగ్ అనంతరం కూడా వైసీపీ రౌడీలు దాడులకు తెగబడుతున్నారు. పల్నాడు, చంద్రగిరి సహా పలుచోట్ల ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటం ఆందోళనకరం. ఈసీ, పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్ధరించడం పై దృష్టి పెట్టాలి. హింసను ప్రేరేపిస్తున్న శక్తులపై కఠినంగా వ్యవహరించి ప్రజలకు రక్షణ కల్పించాలి”. అని ఈసీ, పోలీసులను చంద్రబాబు కోరారు.
నిన్నటి పోలింగ్ లో వైసీపీ గూండాల దాడులను ధైర్యంగా ఎదిరించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలపై పోలింగ్ అనంతరం కూడా వైసీపీ రౌడీలు దాడులకు తెగబడుతున్నారు. పల్నాడు, చంద్రగిరి సహా పలుచోట్ల ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటం ఆందోళనకరం. ఈసీ, పోలీసు ఉన్నతాధికారులు…
— N Chandrababu Naidu (@ncbn) May 14, 2024