కల్కి సెకండ్ పార్ట్ పై బిగ్ అప్ డేట్ ఇచ్చిన అశ్వినీ దత్
కల్కి మూవీ గురించి ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే పురాణాల కథలను బేస్ చేసుకుని దాన్ని భవిష్యత్ కాలానికి అనుసంధానించి తీసిన తీయడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దెబ్బకు నాగ్ అశ్విన్ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇక కల్కి సినిమాలకు సెకండ్ పార్ట్ కూడా ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు.
దాంతో అసలు సెకండ్ పార్ట్ లో ఏముంటుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అసలు సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందా అని కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మూవీ ప్రొడ్యూసర్ అయిన అశ్వినీదత్ మీడియాతో చిట్ చాట్ చేశారు. సెకండ్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ 60 శాతం పూర్తి అయినట్టు తెలిపారు.
మేజర్ పార్ట్స్ కొన్ని షూటింగ్ చేయాల్సి ఉందని.. దాన్ని కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని తెలిపారు నాగ్ అశ్విన్. సెకండ్ పార్ట్ లో ఇంతకు మించిన ఎంటర్ టైన్ మెంట్ ఉంటుందని ఆయన వివరించారు. దాంతో సెకండ్ పార్ట్ మీద అప్పుడే అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.