చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి… చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి… చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం

విశ్వంభర, ఏపీ : తన ప్రమాణ స్వీకారానికి రావాలని మెగాస్టార్ చిరంజీవికి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక ఆహ్వానం పంపించారు. రాష్ట్ర నుంచి ప్రత్యేక అతిథిగా హాజరు కావాలని కోరారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులతో పాటు పలువురు సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందజేశారు. కాగా, బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి చంద్రబాబు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. కేసరపల్లి ఐటీ పార్కు ప్రాంగణంలో ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా హాజరుకానున్నారు. దీంతో ప్రధాని పర్యటనకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్నారు. మరోవైపు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ప్రత్యామ్నాయ రూట్‌లను సూచించారు. అంబులెన్స్‌, అత్యవసర ఆరోగ్య చికిత్స వాహనాలకు మాత్రమే అనుమతి ఉండనుంది.

Read More బాపట్లలో యువతిపై లైంగికదాడి, హత్య

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా