తెలుగు రాష్ట్రాలకు తప్పిన ముప్పు.. తీరం దాటిన రేమాల్
తెలుగు రాష్ట్రాలకు రేమాల్ తుఫాన్ ముప్పు తప్పింది. ఎట్టకేలకు బెంగాల, బంగ్లాదేశ్ మధ్య రెమాల్ తుఫాన్ తీరం దాటింది. అంతేకాదు.. ఈశాన్య దిశలో రెమాల్ తుఫాన్ బలహీపడుతోంది. బెంగాల్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలకు వాతావరణ శాక హై అలర్ట్ ప్రకటించింది. మత్స్యకారులు ఎవరూ కూడా వెంటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.
తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్ప తప్పినా వర్ష సూచనల కనిపిస్తున్నాయి. ఏపీలో పశ్చిమ దిశ నుంచి బలమైన గాలలు వీస్తున్నాయి. దీంతో ఏపీలోని పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది. ఈదురుగాలలుతో కూడా వర్షం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇక తుఫాన్ ప్రభావం ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రతమత్తం అయ్యాయి. లక్ష మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. తుఫాన్ హెచ్చరికలతో పలు విమానాలు, రైళ్ల సర్వీసులు రద్దయ్యాయి. ఇక బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. బంగ్లాదేశ్ పోర్టులో నేవీ అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణలో నిన్న వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన వానతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. పలు జిల్లాలో వేరువేరు ఘటనల్లో 14 మంది మృతి చెందారు. నాగర్ కర్నూ్ల్‌లో 8 మంది, హైదరాబాద్‌లో నలుగురు, మెదక్ జిల్లాలో ఇద్దరు ప్రాణాలు విడిచారు. బలమైన గాలులకు హైదరాబాద్ నగరం అతలాకుతలం అయింది. ఎక్కడిక్కడ చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో.. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి.