ప్రధాని ట్వీట్.. చంద్రబాబు స్పందన

ప్రధాని ట్వీట్.. చంద్రబాబు స్పందన

ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ చేసిన ట్వీట్‌ చేశారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ సేవలు మరువలేనివని, వెండితెరపై ఎన్నో మరపురాని పాత్రలో నటించి మెప్పించారని పేర్కొన్నారు.

ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ చేసిన ట్వీట్‌ చేశారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ సేవలు మరువలేనివని, వెండితెరపై ఎన్నో మరపురాని పాత్రలో నటించి మెప్పించారని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ ఆశయాల సాధనకు కృషి చేస్తామని ఆయన అన్నారు. ప్రధాని మోడీ ట్వీట్‌కు తాజాగా చంద్రబాబు స్పందించారు. ఎక్స్‌లో ప్రధాని ట్వీట్‌కు రీట్వీట్ చేశారు. ‘‘నిజంగా... ఎన్టీఆర్ గారు తెర మీద, తెర వెలుపల ఓ లెజెండ్.’’ అని పేర్కొన్నారు.

అదేవిధంగా ప్రజా కేంద్రక పాలన, సంక్షేమం కోసం పోరాడేందుకు ఆయన ఓ ప్రేరణగా నిలుస్తారు. ఆయన నిస్వార్థ ప్రజాసేవ స్ఫూర్తి చిరస్థాయిగా మన హృదయాల్లో ఉండిపోతుందని చంద్రబాబు అన్నారు.  మన మార్గాలను ప్రకాశవంతం చేస్తుందని, ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం మనం తప్పకుండా కలిసి పనిచేద్దాం మోదీ గారూ!" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

Related Posts