వైసీపీ వల్లే పోలవరం నాశనం అయిందిః సీఎం చంద్రబాబు
విశ్వంభర, అమరావతిః సీఎం చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పోలవరం మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా శుక్రవారం ఆయన పోలవరం ప్రాజెక్టు మీద శ్వేత పత్రం విడుదల చేశారు. వైసీపీ హయాంలో గత ఐదేండ్లుగా పోలవరం ఎలా నష్టపోయిందో వివరించారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు శ్వేత పత్రాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. పోలవరం పట్ల ఏపీ ప్రజలు ఎన్నడూ క్షమించరాని విధంగా జగన్ వ్యవహరించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో గతంలో 31సార్లు క్షేత్రస్థాయి పర్యటనలు, 104సమీక్షలతో పోలవరం ప్రాజెక్టును పరుగులెత్తించి 72శాతం పూర్తి చేశామని పేర్కొన్నారు.
కానీ జగన్ హయాంలో పూర్తి నిర్లక్ష్యం చేసి పోలవరాన్ని మూలన పడేశారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు నాలుగు విధాలుగా అన్యాయం జరిగిందని వివరించారు. మొదటిది డయాఫ్రమ్ వాల్ అయితే, అప్పర్, లోయర్ కాపర్ డ్యాం లు దెబ్బతిన్నాయని వివరించారు. జగన్ చేసిన నిర్వాకం వల్ల ఇప్పుడు ప్రాజెక్టు వ్యయం కూడా పెరిగిపోయినట్టు తెలిపారు చంద్రబాబు నాయుడు.