ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్

ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్

  •  పవన్‌ను అసెంబ్లీ గేటు తాకనివ్వమని చెప్పారు
  • వైనాట్ 175 అని చెప్పిన వారికి 11 సీట్లు వచ్చాయి
  • జనసేన 21కి 21 స్థానాల్లో గెలుపుతో గట్టి సమాధానం
  • రెండో రోజు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌ను ఆకాశానికెత్తారు. పవన్ కళ్యాణ్‌ను అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమని అన్న వైసీపీ నేతలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. 21కి 21 స్థానాల్లో గెలిచి పవన్ కళ్యాణ్ గట్టి సమాధానం చెప్పారని అన్నారు. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ అని కొనియాడారు. 

ఆనాడు 23 సీట్లు వస్తే దేవుడు రాసిన స్క్రిప్ట్ అని హేళన చేశారని, నేడు కూటమికి 164 సీట్లు వచ్చాయని చంద్రబాబు అన్నారు.  ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని వ్యాఖ్యనించారు. పవన్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని విమర్శించారు. వైకాపా వైనాట్ 175 అని చెప్పి 11 సీట్లు తెచ్చుకున్న పరిస్థితిని చూశాం. నా జీవితంలో ఎప్పుడూ చూడని సభ 15వ శాసన సభ. 15వ శాసనసభను కౌరవసభగా మనం భావించాం అన్నారు. ప్రజా జీవితాలను మార్చే శక్తి ప్రభుత్వ విధానాలకు ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ మేరకు అత్యున్నత, గౌరవ ప్రదమైన సభగా దీనిని తీర్చిదిద్దాలని సభ్యులకు సూచించారు.

Read More ఘనంగా కబడ్డీ పోటీలు