నారా భువనేశ్వరి బర్త్ డే.. చంద్రబాబు, లోకేశ్ స్పెషల్ విషెస్

నారా భువనేశ్వరి బర్త్ డే.. చంద్రబాబు, లోకేశ్ స్పెషల్ విషెస్

  • నా సర్వస్వం అంటూ చంద్రబాబు ట్వీట్
  • నీ అంకితభావం మాకు స్ఫూర్తి అని పేర్కొన్న లోకేశ్

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన సందర్భంగా గురువారం ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు ఓ ట్వీట్ చేశారు. ‘‘ఎల్లప్పుడూ సపోర్టివ్‌గా, దృఢంగా ఉంటూ తోడుగా నిలిచింది. చీకటి రోజుల్లోనూ ఎల్లప్పుడూ నవ్వుతూ  ప్రజలకు సేవ చేయాలనే నా అభిరుచిని కొనసాగించడానికి ఆమెకు 100 శాతం తోడ్పడింది. నా సర్వస్వం భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు..’’ అంటూ చంద్రబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

అదేవిధంగా నారా లోకేష్‌ కూడా తన తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు, అమ్మ! మీ ప్రేమ, దయ, మద్దతు నాకు గొప్ప బలం. ప్రజలకు సేవ చేయడం, వ్యాపార చతురత, న్యాయం కోసం పోరాడడం పట్ల మీ అంకితభావం  చూపడంలో మీరు మాకు స్ఫూర్తి. ప్రతీ రోజు నేను మిమ్మల్ని ఎక్కువగా ఆరాధిస్తాను. మీ తెలివి, దయతో మా జీవితాల్లో వెలుగును నింపారు. ఆ వెలుగును ఎప్పటికీ ప్రకాశింపజేయండి.. అమ్మా..’’ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

Read More AP CM: నల్లమల సాగర్‌కు పోలవరం నీళ్లు.. రాష్ట్ర ప్రయోజనాలే నా లక్ష్యం: సీఎం చంద్రబాబు