చంద్రబాబు సీఎం.. లోకేష్ పార్టీ చీఫ్.. బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు సీఎం.. లోకేష్ పార్టీ చీఫ్.. బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు

ఏపీలో పోలింగ్ ముగిసి పది రోజలు దాటినా.. ఇంకా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. దానికి కారణం ఇంకా ఫలితాలు విడదల కాకపోవడమే. మరో 10 రోజుల్లో ఫలితాలు విడుదలవుతాయి. పార్టీలతో పాటు ప్రజల్లో కూడా ఏపీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. బయటకు అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నా.. ప్రతీ నాయకుడిలోనూ ఎదో టెన్షన్ కనిపిస్తోంది. ఈసారి ఎన్నికలు గతంలో ఎప్పుడూ లేని విధంగా హోరాహోరీగా జరిగాయి. దీంతో.. ఫలితాలను ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. 

 

Read More  రెండో రోజు దావోస్‌లో సీఎం చంద్రబాబు

అయితే.. ఎవరికి వారు ధీమావ్యక్తం చేస్తున్నారు. మరో 10 రోజుల్లో రిజల్ట్స్ రానున్న నేపథ్యంలో టీడీపీ నేత బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన ఆయన.. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. అదే రోజు లోకేష్ కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని కోరారు. నారా లోకేష్‌కు పార్టీని నడిపించే సత్తా ఉందని బుద్దా వెంకన్న ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీలో అన్ని వర్గాలు లోకేష్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. 

 

Read More  రెండో రోజు దావోస్‌లో సీఎం చంద్రబాబు

ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రజలకు లోకేష్ నాయకత్వంపై నమ్మకం వచ్చిందని అన్నారు. చంద్రబాబు అమరావతిలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని బుద్దా వెంకన్న చెప్పారు. ఎన్డీఏ కూటమి 130కి స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు.. చంద్రబాబు ఆత్మకథ రాస్తే.. అందులో తనకు కూడా పేజీ ఉంటుందని బుద్దా అన్నారు. తన రక్తంతో చంద్రబాబు పాదాల కడిగానని చెప్పారు.

Related Posts