వైసీపీకి ఓటమి తప్పదు... మరోసారి ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు

వైసీపీకి ఓటమి తప్పదు... మరోసారి ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం ఎదురుకాబోతోందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం ఎదురుకాబోతోందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఎన్నికల్లో గెలవబోతున్నామని జగన్ చెప్పినట్లుగానే రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ కూడా చెబుతున్నారని అన్నారు. ఫలితాలను ముందే అంగీకరించిన వారు పదేళ్లలో నాకు ఎవరూ కనిపించలేదని పేర్కొన్నారు.

అయితే, గెలుస్తామని చంద్రబాబు చెబితే.. గతంలో కంటే ఎక్కువ సీట్లలో గెలుస్తామని జగన్ చెప్పారనీ.. ఈ చర్చకు అంతంలేదని ప్రశాంత్ కిశోర్ చెప్పుచ్చారు. అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ మాట మార్చారని సీఎం జగన్ ఆరోపించారు. ఈసారి వైసీపీకి అధికారం రాదని పీకే ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆయన ఖండించారు.

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

దేశంలో అందరూ షాకయ్యేలా జూన్ 4న ఫలితాలు వస్తాయని జగన్ ధీమా వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల నేతలు ఆంధ్రప్రదేశ్‌నే చూస్తారని తెలిపారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఐప్యాక్ ఎంతో సాయపడిందన్నారు. గత ఐదేళ్ల పాలనలోనూ ఐప్యాక్ సూచనలను అమలు చేశామని ఆయన స్పష్టం చేశారు.